- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ బిచ్చం ఎత్తుకుంటోంది.. మంత్రి వేముల వివాదస్పద వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసిస్తూ, వరిధాన్యం కొనాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే అడుక్కు తింటారని ఎద్దేవా చేసినోళ్లే బిచ్చం ఎత్తుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేయడానికి నిధులు లేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ నడవాలంటే కేంద్రం నిధులు కావాలి, కేంద్రం ఒత్తిడితో ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలనేది బీజేపీ సర్కార్, ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ పరిస్థితి వచ్చినా, తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు.