భక్తులు లేకుండా చరిత్రలో మొదటిసారి

by Shyam |
భక్తులు లేకుండా చరిత్రలో మొదటిసారి
X

దిశ, సికింద్రాబాద్: మహంకాళి బోనాల జాతర అట్టహాసంగా జరిగింది. ఆదివారం ఉదయం 4 గంటలకు మహంకాళికి మహా హారతితో మొదలైన జాతర 9గంటలకు బంగారు బోనం, పట్టు వస్తాలు అలంకరణ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి జరిపే పూజలన్నీ యధావిధిగా వైభవంగా వేదపండితులు, అర్చకుల మంత్రాల మధ్య ఘనంగా జరిగాయి. ఏటా అమ్మవారికి భక్తులు సమర్పించే బోనాలు ఈ ఏటా ఇంట్లోనే సమర్పించుకున్నారు. ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్ అధికారితో అక్కడ ఏర్పాట్లపై చర్చించారు. దర్శించుకునే లక్షలాది మంది భక్తులు లేక ఆలయ పరిసర ప్రాంతాలన్నీ బోసిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed