- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డోలు కొట్టి.. బోనం ఎత్తిన మంత్రి శీనన్న

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కార్యక్రమం ఏదైనా.. తనదైన స్టైల్‌లో రక్తి కట్టించడం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ది అందెవేసిన చెయ్యి. ఇందులో భాగంగానే సోమవారం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిర గ్రామంలో నిర్వహించిన బంగారు మైసమ్మ బోనాల వేడుకలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. బోనాల ముందు కళాకారులు వాయిస్తున్న డోలు తీసుకొని మంత్రి ఉత్సాహంగా వాయించారు. అనంతరం మహిళలు తీసుకువస్తున్న బోనాలకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనే బోనం ఎత్తుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమతో కలిసి బోనం మోస్తుండడంతో గ్రామస్తులలో నూతన ఉత్సాహం నెలకొంది. అనంతరం మంత్రి ఆలయంలో పూజలు నిర్వహించారు.
Next Story