ప్రభుత్వం మాట వినకపోవడం వల్లే ఇదంతా..

by Shyam |
ప్రభుత్వం మాట వినకపోవడం వల్లే ఇదంతా..
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిరావడం వల్లే రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.లాక్‌డౌన్ సమయంలో ఎవరూ ఆకలితో ఇబ్బందులు పడకూడదనే అందరికి ఆహారం అందించామని చెప్పుకొచ్చారు. శనివారం జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ..కరోనా వ్యాప్తి చెందకుండా హోమ్ క్వారంటైన్ వలన వైరస్‌ను కట్టడి చేయగలిగామన్నారు. ప్రభుత్వం ఎన్ని సూచనలు చేసినా, మైకులు, ఆటోల ద్వారా ఎంత అవగాహన కల్పించినా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లి రావడం వల్లే కేసుల తీవ్రత పెరిగిందన్నారు.ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారు వ్యక్తిగతంగా క్వారంటైన్ అవ్వాలని సూచించారు.దుకాణం యజమానులు వస్తువులు అమ్మే సమయంలో మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించే వారికే విక్రయాలు జరపాలన్నారు.అలాగే జూన్ 8నుంచి దేవాలయాలకు తెరచుకోనుండటంతో తగు జాగ్రత్తలు పాటించి, దైవ దర్శనం చేసుకోవాలని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాను ఆరోగ్యవంతంగా చేయడానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని మంత్రి చెప్పారు.జిల్లాలో రోడ్డు విస్తరణ, జంక్షన్ల ఏర్పాటు జరుగుతుందని, మహబూబ్ నగర్ పట్టణాన్ని సుందరీకరణంగా ఆధునీకరించడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్‌తో కలిసి గర్భాధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్దారణ ప్రక్రియ నిషేధ చట్టం 1994 అనే ఫోమ్ బోర్డులను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ మోహన్ లాల్, మున్సిపల్ చైర్మన్ కెసీ నరసింహులు, డీఆర్ఓ‌కే. స్వర్ణలత, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ యాదయ్య, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed