- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీజేఆర్ మృతికి వైఎస్సార్ కారణం కాదా..? తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న నీటి వివాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నీటి పంచాయతీలతో మళ్లీ గొడవలు మొదలయ్యాయని, తండ్రి తప్పు చేస్తే.. కొడుకు అలా ఉండడు అనుకున్నామని సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పు దిద్దుకుంటామని చర్చలు జరిపామని, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్సార్‌ను దొంగ అనక ఏమంటారు?.. ఇప్పుడు జగన్ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారు. నిన్నటి వరకు మంచితనం ప్రదర్శించిన జగన్ ఇప్పుడు ఊసరవెల్లిలా మారారని విమర్శించారు. సయోధ్యతో ఉందామనుకుంటే నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలు ఉన్నారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. పీజేఆర్ మృతికి వైఎస్సార్ కారణం కాదా? అని శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు.
‘మా విగ్రహాలు ఏపీలో ఉండవు కానీ.. మీ విగ్రహాలు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నాయి.. తెలంగాణ మొత్తం మీరే ఇచ్చినట్లు విగ్రహాలు పెట్టుకున్నారు. తెలంగాణ అధికారులను ఏపీలో ఇబ్బందులకు గురిచేశారు. నీటిపై సీపీఐ నారాయణ స్పష్టమైన వేఖరి చెప్పాలి’ అని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.