- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాగ్రత్తగా ఉండాలంటూ.. చేతులెత్తి మొక్కిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘కరోనా మహమ్మారి మళ్లీ కొరలు చాస్తోంది.. మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితులు విషమించకుండా జాగ్రత్తగా ఉండండి’ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజలను కోరారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిని.. జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. జిల్లాలో వైరస్ సోకిన వారి కోసం ప్రభుత్వ ఆస్పత్రిలోనే పరీక్షలు, చికిత్స అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే 150 పడకలతో స్పెషల్ వార్డు ఏర్పాటు చేశామని.. ఇందులో 24 గంటల పాటు డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. అంతగా అవసరమైతే జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల సహకారంతో కూడా సేవలు అందిస్తామని భరోసానిచ్చారు. కరోనా వైరస్‌పై ముఖ్యంగా.. మీడియా మిత్రులు భయభ్రాంతులకు గురయ్యే విధంగా వార్తలు ప్రసారం చేయొద్దని.. వార్తలు కూడా అవగాహన కల్పించేలా ఉండాలని మంత్రి సూచించారు.