ఖరీఫ్‌కు ఎరువులు సిద్ధం చేయాలి : వ్యవసాయ శాఖ మంత్రి

by Shyam |
ఖరీఫ్‌కు ఎరువులు సిద్ధం చేయాలి : వ్యవసాయ శాఖ మంత్రి
X

దిశ, న్యూస్‌బ్యూరో : ఖరీఫ్ సీజన్‌ కోసం ఎరువుల కంపెనీలు తమ తమ కోటా వెంటనే సరఫరా చేయాలని.. జిల్లాల్లో ఎరువుల నిల్వకు సమస్యలు లేకుండా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. శనివారం హాకాభవన్‌లో ఖరీఫ్ సీజన్ ఎరువుల సేకరణపై వ్యవసాయ శాఖ అధికారులు, మార్క్‌ఫెడ్, రైల్వే, అగ్రోస్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం కోటా 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో కలుపుకుని మొత్తం 21.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఖరీఫ్ సీజన్ కోసం కేటాయించినట్టు తెలిపారు. ఏప్రిల్‌లో తెలంగాణకు 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా.. 0.35 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందన్నారు. రాష్ట్రానికి వచ్చే రేక్‌లకు అనుగుణంగా ఎరువుల సంస్థలతో మార్క్‌ఫెడ్‌కు ఉన్న ఒప్పందం మేరకు హ్యాండ్లింగ్ సంస్థలు స్థల లభ్యతను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Tags : Agriculture Minister, Kharif, fertilisers, Markfed

Advertisement

Next Story

Most Viewed