- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జిల్లాలో రైతులు పంట మార్చండి : సబితా ఇంద్రారెడ్డి
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని 2,69,022 మంది రైతుల ఖాతాల్లో ఈ-కుబేర్ ద్వారా రూ.342.86 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ… జిల్లాలో ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిందనన్నారు. రంగారెడ్డి జిల్లాలో రైతులు వరికి బదులుగా కూరగాయలను పండించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం వివిధ విభాగాలపై జరిగిన అంశాలపై అధికారులు మాట్లాడుతూ… ప్రస్తుతం జిల్లాలో కరోన తీవ్రత చాలా మేరకు తగ్గిందని రెండు లక్షల మంది సూపర్ స్పైడర్‌లకు వ్యాక్సినేషన్ చేశామని వైద్యశాఖ అధికారులు తెలియజేశారు.
ఫీవర్ సర్వేల ద్వారా జిల్లాలో కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. ఆమనగల్ మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని వంద పడకలకు పెంచాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కోరారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల లో పల్లె ప్రకృతి వనాలు గ్రౌండ్ అయ్యాయని ప్రతి గ్రామంలో మొక్కలు నాటే విధంగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారు చేశామని జిల్లా పంచాయతీ అధికారి తెలియజేశారు. బీజాపూర్ హైవేను త్వరగా పూర్తిచేయాలని నేషనల్ హైవేస్ అధికారులకు, హిమాయత్ నగర్ నుండి చిలుకూరు పోయే రహదారిని త్వరగా పూర్తి చేయాలని చేవెళ్ల శాసనసభ్యులు కాల యాదయ్య గారు ఆర్అండ్‌బీ అధికారులను కోరారు. కోకాపేట నుండి శంకర్పల్లికి వెళ్లే రహదారి పనులను తొందరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి ఆదేశించారు.
జిల్లాలో ప్రస్తుతం కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈ సమావేశాన్ని ఆన్ లైన్ ద్వారా నిర్వహించినందుకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితా రెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా అధికారులతో పాటు జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, డీసీసీబీ చైర్మన్ కొత్త మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ ఈట గణేష్, కొ- ఆప్షన్ సభ్యులు ముజిబుర్ రెహ్మాన్లు పాల్గొన్నారు.