- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదర్శంగా తీర్చిదిద్దుతా : మంత్రి
దిశ, రంగారెడ్డి: మహేశ్వరం మోడల్ స్కూల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మోడల్ స్కూల్ వార్షికోత్సవం దిశ కార్యకమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్‌లకు నిధులు బంద్ చేసినా.. రాష్ట్రంలోని 195మోడల్ స్కూల్‌లకు రూ.300కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆంగ్లంలో విద్యాబోధన చేస్తున్నామన్నారు. మొత్తం ఒక లక్ష 32వేల మంది విద్యార్థులు మోడల్ స్కూల్‌లలో చదువుతున్నరని అన్నారు. మన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ తరహాలో మన రాష్ట్రంలో అభివృద్ధి పర్చనున్న మహేశ్వరం పాఠశాలకు సంబంధించి ఒక బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్టు వెల్లడించారు. బాసర ఐఐటీలో మొత్తం 1500మంది విద్యార్థులు ఉంటే అందులో 500 మంది మోడల్ స్కూల్ల నుంచే ఎంపిక అవ్వటం గొప్ప విషయం అన్నారు.