- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నిమ్మగడ్డకు ఫిర్యాదు చేసినా.. మా దొడ్లో ఎద్దుకు చేసినా ఒకటే’
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీలకు అతీతంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు మేనిఫెస్టోను ఏ విధంగా విడుదల చేస్తారని ప్రశ్నించారు. అంతేగాకుండా తనను ఉన్మాది అనడానికి చంద్రబాబుకు ఏ అర్హత ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాకు మంత్రి పదవి ఇచ్చాడా.. చంద్రబాబే ఉన్మాది అంటూ ఫైర్ అయ్యారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కమార్, చంద్రబాబు ఇద్దరు తోడు దొంగలు అని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు తీసుకోవాలని.. తాము ఫిర్యాదు చేయబోమని అన్నారు. అంతేగాకుండా ‘‘నిమ్మగడ్డకు ఫిర్యాదుచేసినా.. మా దొడ్లో ఎడ్లకు ఫిర్యాదు చేసినా రెండూ ఒకటే’’ అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.