- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నన్నెవరూ కలవద్దు…
దిశ ప్రతినిది, కరీంనగర్: రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గ ప్రజలకు ఓ సూచన చేశారు. 15 రోజుల పాటు తనను వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేయవద్దని కోరారు. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న నేపధ్యంలో నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. 15 రోజుల పాటు తనను కలవడానికి ఎవరూ హైదరాబాద్ కు రావద్దని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఏ అవసరం ఉన్న తనని కానీ, తన పీఎలను కానీ ఫోన్ లోనే సంప్రదించాలని సూచించారు. 24 గంటలు ఫోన్ లో అందుబాటులో ఉంటామని తెలియజేశారు. తనను కలవడానికి వచ్చి ఇబ్బందిపడవద్దని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నియంత్రణ కోసం మంత్రి ఈటల నిరంతరం ఆసుపత్రుల్లో పర్యటిస్తున్నారు. వైద్య మంత్రిగా ఆయన తరచూ రివ్యూ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన వద్దకు వచ్చే నియోజకవర్గ ప్రజలను రావద్దని చెప్తున్నారు. సీఎం సహా పలువురు ప్రముఖులకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో మంత్రి ఈటల ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.