శ్రీరామ నవమికి భక్తులను రావద్దన్న దేవాదాయ శాఖ మంత్రి

by Sridhar Babu |
శ్రీరామ నవమికి భక్తులను రావద్దన్న దేవాదాయ శాఖ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి సంవత్సరం నిర్వహించినట్టే ఈ ఏడాది కూడా భద్రాద్రి శ్రీరామచంద్ర స్వామి నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కానీ ఈ ఉత్సవాలకు భక్తులు ఎవరు రావద్దని ఆయన కోరారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇవాళ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్, దేవాదాయ శాఖ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌తో చర్చించిన ఆయన ఈ ప్రకటన చేశారు. రాములోరి కల్యాణానికి సంబంధించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి తిరిగి డబ్బులు చెల్లిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ఆలయాల్లోనూ కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, ఆలయాలను శానిటైజ్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed