సాహిత్యంలో కవిరాజు సినారె

by Shyam |
సాహిత్యంలో కవిరాజు సినారె
X

దిశ, న్యూస్‌బ్యూరో: సాహిత్య రంగంలో సినారె కవిరాజు అని మంత్రి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ సారస్వత పరిషత్‌లో బుధవారం నిర్వహించిన సినారె 88వ జయంతి ఉత్సవాలకు మంత్రి నిరంజన్ రెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి , దేశపతి శ్రీనివాస్, మామిడి హరికృష్ణలు హాజరయ్యారు. తెలంగాణ సారస్వత పరిషత్ అందించే సినారె సాహితీ పురస్కారం శ్రీనివాసాచార్యకు అందజేశారు. సుశీలా నారాయణరెడ్డి ప్రచురించిన డాక్టర్ సినారె సినీగీత సర్వస్వం ఆరో సంపుటి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గతేడాది రెండు రోజులు వనపర్తిలో సినారె జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. సినారె సాహిత్య సదన్‌కు హైదరాబాద్‌లో శంకుస్థాపన జరగడం శుభసూచకమన్నారు. ఆగస్టు 25న సురవరం ప్రతాపరెడ్డి కాంస్య విగ్రహం, వచ్చే ఏడాది సినారె జయంతి నాటికి సి.నారాయణరెడ్డి కాంస్య విగ్రహం వనపర్తిలో ఆవిష్కరిస్తామన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నారాయణ‌రెడ్డికి నేను ఏకలవ్య శిష్యుడినని గుర్తుచేశారు. ఢిల్లీలో రాజ్యసభ్యుడిగా వారితో పాటు ఐదేళ్లు ఉండడం నా అదృష్టమన్నారు.

Advertisement

Next Story

Most Viewed