మరో టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు అసెంబ్లీకి రానున్నారు : కేటీఆర్

by Sridhar Babu |   ( Updated:2021-08-11 05:12:17.0  )
KTR, gellu srinivas
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కెసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గెల్లు శ్రీనివాస్‌కు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరో టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు అసెంబ్లీకి రానున్నారని అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా.. తెలంగాణ ఉద్యమంలో ఆయన తీవ్రంగా పోరాడారని గుర్తుచేశారు. కాగా, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే అంకితభావంతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమకాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలుకెళ్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

Advertisement

Next Story

Most Viewed