- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు
by Shyam |

X
దిశ ప్రతినిధి, నల్లగొండ: ముస్లిం సోదరులకు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 1 నుంచి మూడ్రోజుల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరుపుకోనున్న బక్రీద్ మహోత్సవంలో విధిగా భౌతిక దూరం పాటించాలని జగదీష్ రెడ్డి సూచించారు. కోవిడ్ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో పూజలు ఇంటి దగ్గర జరుపుకోవాలని ఆయన తెలిపారు. త్యాగానికి నిర్వచనంగా ముస్లిం సోదరులు జరుపుకునే బక్రీద్ పండుగ ఈ సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నందున అందుకు అనుగుణంగా జరుపుకునేందుకు సిద్ధపడాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూనే మాస్క్‌లు ధరించి తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ బక్రీద్ పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లిం సోదరులకు మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
Next Story