అమ్మనబోలులో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తాం

by Shyam |   ( Updated:2020-10-15 09:53:32.0  )
అమ్మనబోలులో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తాం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-యాదాద్రిభువనగిరి జిల్లాల మధ్య ప్రధాన వారధిగా నిలిచే అమ్మనబోలులో హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తామని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం సీఎం కేసీఆర్‌ను సంప్రదిస్తామని తెలిపారు. రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నకిరేకల్ నియోజకవర్గంలోని అమ్మనబోలు వంతెనతో పాటు రెండువైపులా రోడ్లు ధ్వంసం అయ్యాయి.

గురువారం మంత్రి జగదీష్ రెడ్డి వంతెనను పరిశీలించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ముందెన్నడూ ఈ తరహా వర్షాలు మూసీ నదిలో ఇంతటి వరద ఉధృతిని చూడలేదని, మనకంటే ముందు తరం పెద్దలు చెప్పడమే ఇందుకు నిదర్శమన్నారు. ఈ రహదారి పునరుద్ధరణకు తాత్కాలిక ఏర్పాట్లు చేయడంతో పాటు శ్వాశత పరిష్కారానికి హైలెవల్ బ్రిడ్జి నిర్మించ తలపెట్టినట్టు మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story