ఏళ్లనాటి శని విరగడైంది: మంత్రి జగదీశ్‌రెడ్డి

by Shyam |
ఏళ్లనాటి శని విరగడైంది: మంత్రి జగదీశ్‌రెడ్డి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: మూసికి పట్టిన ఏళ్లనాటి శని విరగడయిందని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకుల నిర్లక్ష్యంతోనే మూసి ఆయకట్టు రైతాంగానికి శాపంగా మారిందన్నారు. శనివారం మూసి కుడి, ఎడమ కాలువలకు మంత్రి సాగునీటిని విడుదల చేశారు. సీఎం కేసీఆర్ చొరవతో రూ. 21 కోట్లతో మరమ్మతులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , డీసీఎంఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, జెడ్పీటీసీ బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story