రైతు బంధు ఆగదు: జగదీష్ రెడ్డి

by Shyam |
రైతు బంధు ఆగదు: జగదీష్ రెడ్డి
X

దిశ, నల్గొండ: తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతులే నిర్ణయించుకునే రోజు రావాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం అనిరెడ్డిగూడెంలో రైతులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే నియంత్రిత సాగు లక్ష్యమన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పండించిన పంటను కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రభుత్వం దృష్టి సారించిందని జగదీష్ రెడ్డి వివరించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు బంధును నిలిపివేస్తారని జరుగుతున్న ప్రచారాలు అసత్యమని ఆయన కొట్టిపారేశారు. రైతులు వేసిన పంటను అధికారులు రికార్డు చేసుకోవాలని సూచించారు. రైతు బంధు అందకపోతే అధికారులే బాధ్యత వహించాలని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed