- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
7 వేల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
by Shyam |

X
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు రూ.30లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన దివీస్ యాజమాన్యం తరుపున 7వేల కుటుంబాలకు మంగళవారం నిత్యావసరాలను పంపిణీ చేశారు. లాక్‌డౌన్ సమయంలో పేదలకు అండగా ఉండడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశ్యంతో పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ బియ్యం, రూ. 1500 ఇచ్చారని చెప్పారు. కరోనా గురించి ఆందోళన చెందకుండా కలిసి జీవించే అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story