గంగమ్మకు హరీష్‌రావు పూజలు..

by Shyam |
గంగమ్మకు హరీష్‌రావు పూజలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి హరీష్ రావు గురువారం సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వద్ద గంగమ్మకు పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండటంతో నిండుకుండను తలపిస్తోంది. దాంతో సంబంధిత అధికారుల నుంచి వరద వివరాలను మంత్రి సేకరిస్తున్నారు.

Advertisement

Next Story