- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డిపాజిట్ కోల్పోతామన్న భయంతోనే నాటకాలు
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ నేతలు నాటకాలాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతల ఇళ్లు మాత్రమే కాకుండా టీఆర్ఎస్ నేతల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు చేశారని స్పష్టం చేశారు. పోలీసుల, అధికారుల విధులకు అందరం సహకరించాలని సూచించారు.
సోదాలు చేసిన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు బయటపెట్టాలని తెలిపారు. రెండ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి.. మళ్లీ రివర్స్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ దుబ్బాకలో డిపాజిట్ కోల్పోతామన్న భయంతోనే ఇలాంటి నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంట్లో దొరికిన డబ్బు రఘనందన్ రావుదేనని ఇంటి యజమాని వెల్లడించారని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్దతి కాదు అని మంత్రి హితవు పలికారు.
టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు నేతలు, బీజేపీ నేత ఇళ్లపై దాడులు జరిగాయని అన్నారు. బీజేపీ నేతల ఇళ్లలో డబ్బులు దొరకడంతో వారు గత్తరగత్తర చేస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను ఆదేశించారు. ఎన్నికల కమిషన్, అధికారులపై పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు.