- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగనాయక సాగర్‌కు నీటి విడుదలపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చందలాపూర్‌లోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌కు నీటి విడుదలపై సంబంధిత అధికారులతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. గురువారం సాయంత్రం రంగనాయక సాగర్ టన్నెల్, సంపు హౌస్‌లను మంత్రి సందర్శించారు. అనంతరం టన్నెల్ పంప్ హౌస్ సమావేశ కార్యాలయంలో ఇరిగేషన్ ఎస్ఈ ఆనంద్, మెఘా ప్రతినిధి ఉమామహేశ్వర రెడ్డి, ప్రజాప్రతినిధులు వేలేటి రాధాకృష్ణ శర్మ, జాప శ్రీకాంత్ రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డితో నీటి విడుదలపై మంత్రి సమీక్ష జరిపారు. ఇప్పటివరకు ఎన్ని టీఏంసీ నీళ్లు సాగర్‌లో చేరాయి, ప్రధాన ఎడమ, కుడి కాలువలకు నీళ్లు రావాలంటే ఇంకా ఎన్ని టీఎంసీ నీళ్లు కావాలని ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజుల్లో ఎడమ, కుడి కాలువలకు నీళ్లు రానున్నాయని ఇరిగేషన్ అధికారిక వర్గాలు మంత్రికి వివరించారు. చివరగా నియోజకవర్గంలోని మండలాల వారీగా ఏయే గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు ముందుగా నిండనున్నాయనే అంశాలపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు చర్చించారు.
Tags: ranganayaka sagar project,tonnel pump house, minister harish rao review with officers