కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న ఈటల రాజేందర్

by Shyam |
Minister Etela Rajender
X

దిశ, హుజురాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. సోమవారం హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ… మూడో విడుతలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు ఆ పైన ఉన్న వ్యాధి గ్రస్తులకు వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత గల.. తగిన వయస్సువారంతా దీన్ని తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు.

Advertisement

Next Story