రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు : బొత్స

by srinivas |
రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు : బొత్స
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ఎస్ఈసీ రమేశ్ కుమార్ రాజకీయ నేతలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వ్యక్తిగత అవసరాల కోసం నిమ్మగడ్డ పనిచేస్తున్నారని అన్నారు. ఎస్ఈసీకి అధికారంతో పాటు బాధ్యతలు కూడా గుర్తుండాలని సూచించారు. అధికారం తప్ప.. బాధ్యతల గురించి నిమ్మగడ్డ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ప్రజారోగ్యాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. అంతేగాకుండా సీఎస్ నిమ్మగడ్డ ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఎన్నికలు ఆలస్యమైతే నష్టమేంటి అని అన్నారు. ఎవరి మెప్పు పొందాలని నిమ్మగడ్డ ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత అవసరాల కోసం నిమ్మగడ్డ రమేశ్ పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎస్ఈసీకి అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉండాలని మంత్రి బొత్స గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed