మేము చచ్చామా, బతికి ఉన్నామా అని చూడటానికి వచ్చారా.. బాధితుల ఆగ్రహం

by srinivas |
srinivas reddy
X

దిశ, ఏపీ బ్యూరో : నెల్లూరులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌ బాబులకు చేదు అనుభవం ఎదురైంది. వరద ముంపులోని కోవూరు స్టౌ బీడీ కాలనీని పరిశీలించేందుకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కలెక్టర్‌లు వెళ్లారు. దీంతో వరద బాధితులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన తర్వాత పర్యటనకి వస్తారా అంటూ మండిపడ్డారు. మంత్రి బాలినేని , ఎమ్మెల్యే, కలెక్టర్‍తో వరద బాధితుల వాగ్వాదానికి దిగారు. ‘మేము చచ్చామా? బతికి ఉన్నామా? అని చూసే దానికి ఇప్పుడు వచ్చారా అంటూ ప్రశ్నించారు.

కోవూరు పర్యటనకు వచ్చిన మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీసం జిల్లా మంత్రులు కూడా స్పందించలేదు. కోవూరును బలిపశువు చేశారు. ఒకేసారి 5.50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని వదిలి మా జీవితాలను అల్లకల్లోలం చేశారు అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కనీసం ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇంత బాధ్యతారహితమైన ప్రజాప్రతినిధులను ఎన్నడూ చూడలేదు’ అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల సాయంతో అక్కడి నుంచి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ బాబులు నెమ్మదిగా జారుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed