- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈ జిల్లాలో ఆ శాఖ అంతా బీఅలర్ట్..!

దిశ, అచ్చంపేట : ఓ శాఖ అధికారి... హైదరాబాద్ లో తనకున్న పలుకుబడి మెహర్బానీ తదితరులు లాభంగా అక్కడే పాతకుపోయేలా కూర్చున్న నేపథ్యం... నేడు కూడా సార్ నాకు అక్కడే కావాలి.. భీష్మించుకొని కూర్చోవడంతో... లేదు.. లేదు తప్పకుండా అక్కడికే వెళ్లి విధులలో జాయిన్ కావాలని కచ్చితంగా ఆ శాఖ ఉన్నతాధికారి హుకుం జారీ చేయడంతో చేసేది లేక నాగర్ కర్నూల్ జిల్లా లో బాధ్యతలు తీసుకొనున్నారు. ఈ జిల్లా ఇన్చార్జి సివిల్ సప్లై అధికారి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. అయితే ఈ జిల్లాలో ఆ శాఖకు సంబంధించిన జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఒకసారి అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రచారం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే...
పౌరసరఫరాల శాఖ కు మొన్నటి వరకు ఆయన రంగారెడ్డి జిల్లా.. ఇంచార్జీ అధికారి."నా రూటే సపరేటు"" అన్న చందంగా ఆయన వ్యవహార శైలి సాగిందని, ఆ అధికారి గురించి బాగా తెలిసిన వాళ్ళు చెబుతారు. తాజాగా ఆ అధికారి కి నాగర్ కర్నూల్ కు బదిలీ అయ్యిందని తెలిసింది. ఐతే..ఏవేవో ఆరోగ్య కారణాలను సాకుగా చూపి మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో "కూర్చుందాం" అని ఆ అధికారి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది... నాగర్ కర్నూల్ వెళ్ళక తప్పదు, గో అండ్ జాయిన్ అని ఖరాఖండిగా ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది.
దేవుళ్లను ప్రార్థన చేసిన అక్కడి కిందిస్థాయి సిబ్బంది..
"సహకరిస్తే.. సై, నచ్చకపోతే నై" అనేలా,ఆ అధికారి రంగారెడ్డి సిబ్బంది తో పొమ్మనక పొగ పెట్టే లా వ్యవహరించే వారని , అతని టార్చర్ భరించ లేక.. దేవుడా ఇతను వెళ్లి పోయేలా చూడు స్వామి అని దేవుళ్లకు ప్రార్ధన చేసిన సిబ్బంది ఎదురు చూశారంటే అతియోశక్తి కాదు. రేషన్ డీలర్లు సైతం "వీ... పోతే బాగుండు" అని అతని కి సమర్పించుకునే మామూళ్ల బాధ ఐనా పోతుందని దైవాన్ని శరణు వేడిన వాళ్ళే. మొత్తానికి అందరి గోడు, బాధ విన్నాడో ఏమో ఆ అంతర్యామి.
ఆ జిల్లాలో గెటౌట్ అంటూ...
బాబు ఇక రంగారెడ్డి జిల్లా నుంచి సర్దు కో.. గెట్ అవుట్ అంటూ కరాకండిగా ఉన్నతాధికారి చెప్పడం. కానీ అతను ఐఏఎస్ అధికారుల ప్రాపకం తో..దశాబ్ద కాలంగా హైదరాబాద్, మేడ్చల్ ఇలా తనకు నచ్చిన చోట నే లాబీయింగ్ చేసి పోస్టింగ్ దక్కించుకున్న సదరు "డ్రై ఫ్రూట్" ప్రియుడికి రంగారెడ్డి జిల్లా లో చేదు అనుభవం తో..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ని నాగర్ కర్నూల్ కు మంగళ వారం బదిలీ అయ్యిందని తెలిసింది. ఆ అధికారి బదిలీ అయ్యాడు, "ట్రాన్స్ఫర్ అయ్యిండట కదా వా..." అంటూ అంటూ ఎంతో సంబురం తో కొందరు డీలర్లు సోమవారం రాత్రి నుంచే పరస్పరం ఫోన్ లు చేసి "గుడ్ న్యూస్" అంటూ .. చెప్పుకున్నారని సమాచారం. రంగారెడ్డి జిల్లా కు రాక ముందు మేడ్చల్ జిల్లా బాలానగర్ లో, ఉప్పల్ లో పని చేసినపుడు కూడా రేషన్ డీలర్లు ఇక ఈ అధికారి ఆగడాలు, మామూళ్ల వేధింపులు భరించలేం మహా ప్రభో అని వేడుకొనేవాళ్లు.
గతేడాది ఐఏఎస్ అధికారి అండతో...
పోయిన ఏడాది లో తెలంగాణ కు పని చేసి .ఈ సం. ఆంధ్ర కి కేటాయించబడిన ఓ ఐ ఏ ఎస్ అధికారిణి అండ దండ ల తో..బండి లాగించిన సదరు అధికారి, బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో.. కేసీఆర్ ను బావ అని, మాజీ సీఎం సతీమణి ని అక్క అని సంబోధిస్తూ..కొందరు తెలంగాణ గెజిటెడ్ అధికారులకు "అమ్మో వీడు సీఎం చుట్టం" అనే లెవెల్లో బిల్డప్ ఇచ్చేవాడని టి జీ వో అధికారులు కొందరు ఇప్పటికి అంటుంటారు. మెదక్ లో ..ఇంచార్జ్ డి ఎస్ వో గా ఉండగా రైస్ మిల్లర్స్ అటు చీఫ్ సెక్రటరీ కి, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తే..పౌరసరఫరాల శాఖ కమిషనర్ సస్పెండ్ చేసిన విషయం ఆ శాఖ లో అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ నాంపల్లి ప్రాంతానికి పని చేసినపుడు చీఫ్ రేషనింగ్ అధికారి తో తిట్లు పడి, ఉప్పల్ కి వెళ్ళాగా..అక్కడ బినామీ డీలర్ల తో పండుగ చేసుకుని, కొందరు డీలర్ల ఫిర్యాదు తో బాలానగర్ కు పోస్టింగ్ వేయించుకున్నట్టు ఉప్పల్ కు చెందిన కొందరు డీలర్లు చెప్తుంటారు.
మేడం పేరు చెప్పుకొని...
నిరుడు రంగారెడ్డి జిల్లా కు ఏ ఎస్ వో గా వచ్చి రావడం,ఆ వెంటనే అక్కడ ఉన్న సీనియర్ అధికారి పదోన్నతి పై వెళ్లడం తో.. తాత్కలికంగా ఇంచార్జ్ డీసీఎస్ వో గా బాధ్యతలు చేపట్టిన అధికారికి .."మేడం" పేరు చెప్పి దండుకోవడం, మేడం కి చెప్తా.."మేడం పిలుస్తుంది" అని సిబ్బందిని బ్లాక్ మెయిల్ చేయడం ఒక పనిగా పెట్టుకున్నాడని బలమైన ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయ వర్గాలు, రేషన్ డీలర్లు చెప్పుకోవడం పరిపాటిగా..మారింది. ఇదిలా ఉండగా గత ఏడాది సెప్టెంబర్ ఆఖర్లో సిబ్బంది ని ఒకరిని "బోసిడికే" అని అనుచితంగా మాట్లాడాడు అని తెలిసింది. ఆ తిట్ల పురాణం పై జిల్లా ఉన్నత అధికార యంత్రాంగానికి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక మరో ఉన్నతాధికారి సమక్షంలో సైతం తను మరోసారి ఆ విధంగా మాట్లాడిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే పెద్ద మొత్తంలో లాబీయింగ్ చేశాడని అంటున్నారు.
కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్టుగా...
ఏది ఏమైనప్పటికీ..కర్ణుడి చావు కి ఎన్నో కారణాలు అన్న చందంగా ఎక్కడ పని చేసినా ఫిర్యాదులు, ఆరోపణలు ఎదుర్కొని రంగారెడ్డి జిల్లా ను దున్నుకుందాo, ఆపుడపుడు "అమరావతి" లో సేద తీరుదాo అనుకున్న సదరు అధికారి నాగర్ కర్నూల్ కు బదిలీ కావడంతో..అటు సిబ్బంది,ఇటు డీలర్లు దేవుడు మంచి పని చేశాడు అని, మా మోర ఆలకించాడు అని భావిస్తున్నట్టు సమాచారం.