- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీడీపీ వాళ్లకి మాట్లాడే అర్హత లేదు: అనిల్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ఎత్తును తగ్గిస్తున్నట్టు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించమని స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన అనిల్.. చెప్పిన సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా 2021లోనే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. పోలవరం నిర్వాసితులను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించిన అనిల్.. జనం ఓడించినా కూడా చంద్రబాబు మాత్రం అబద్ధాలు చెప్పడం మానలేదన్నారు. అసలు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని మంత్రి అనిల్ కౌంటర్ ఇచ్చారు.
Next Story