- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్‌లైన్‌లో రవాణా శాఖ.. ఐదు కొత్త సేవలు
దిశ ప్రతినిధి, ఖమ్మం: రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులకు అన్ని రకాల సేవలు అందించేందుకు అన్ని చర్యలు ఇప్పటికే చేపట్టారు. శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మరో ఐదు సేవలు ఆన్లైన్ ద్వారా పొందే వేసులుబాటును కల్పించారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ శాఖ సమన్వయంతో డూప్లికేట్ ఎల్‌ఎల్‌ఆర్ పొందడానికి, డూప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జి మంజూరు, స్మార్ట్ కార్డ్ పొందడానికి, లైసెన్స్ సమర్పించి కొత్తది పొందడానికి, లైసెన్స్ హిస్టరీ షీట్ పొందే సేవలను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. ఆయా సేవలు ఇక నుంచి పూర్తి ఆన్లైన్‌లోనే పొందవచ్చన్నారు.
అక్రమాలకు అడ్డుకట్ట వేసి పారదర్శక పాలన అందించేందుకు ఇప్పటికే ఆధార్‌ను తప్పనిసరి చేశామని, అనేక సేవలను ఆన్‌లైన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగనవసరం లేదని, మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం అసలే ఉండదని స్పష్టం చేశారు. అలాగే ఈ నూతన విధానం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను ఆన్‌లైన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజల వెసులుబాటు కోసం శాఖలో మరిన్ని సేవలు మరింత తేలికపాటిగా పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.