- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అథ్లెట్ నీరజ్ చోప్రా జీవితంపై బాలీవుడ్ బయోపిక్.. హీరో ఎవరంటే?

దిశ, సినిమా : టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి భారతజాతిని గర్వంగా తలెత్తుకునేలా చేశాడు అథ్లెట్ నీరజ్ చోప్రా. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తనపై ప్రశంసల వర్షం కురిపించగా.. రివార్డులు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలోనూ ఆయన ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో నీరజ్ జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కించే అంశం తెరమీదకు వచ్చింది. తనకు కంగ్రాట్స్ చెప్తూ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మిలప్ జవేరి.. నీరజ్ చోప్రా- హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ట్విన్ బ్రదర్స్‌లా కనిపిస్తున్నారని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా షేర్ చేసిన ఆయన.. బయోపిక్ తీస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. దీంతో సిద్ధార్థ్ అభిమానులు త్వరగా ప్లాన్ చేయమని సూచిస్తున్నారు. ఈ ఫొటోలో నీరజ్.. ‘మర్ జావా’ సినిమాలో సిద్ధార్థ్ లుక్స్‌కు దగ్గరగా ఉండగా.. ఫ్యాన్స్ బయోపిక్ టాపిక్‌ను వైరల్ చేస్తున్నారు.