- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనూసూద్ వెల్డింగ్ వర్క్ షాప్
సోనూసూద్ రియల్ హీరో అయిపోయాడు. అసలు ఎలాంటి ఆధారం లేని వలస కార్మికులకు నేనున్నానంటూ భరోసానిచ్చి.. లాక్‌డౌన్‌లో వాళ్లను సొంతూళ్లకు చేర్చాడు. కాలి నడకన సొంత గూటికి పయనమయ్యేందుకు సిద్ధమైన వారికి.. సొంత ఖర్చులతో ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యంతో పాటు భోజన సదుపాయం కల్పించి దగ్గరుండి మరీ ఇంటికి పంపించారు. ఎక్కడ ఏ వలస కార్మికుడు ఇబ్బంది పడుతున్నా సరే.. తనను కాంటాక్ట్ చేయొచ్చంటూ.. హెల్ప్ లైన్ నంబర్ కూడా రిలీజ్ చేశాడు. దీంతో ‘నేషన్ సూపర్ హీరో’ అయిపోయిన సోనూకు భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ‘భారత రత్న’ ఇవ్వాలని, ఆ విధంగా తను చేసిన పనిని గౌరవించాలని దేశమంతా కోరుతోంది.
https://www.instagram.com/p/CC0MP49HO_J/?igshid=yei6gqtfgfhh
ఈ క్రమంలో ఒక వలస కార్మికుడు సోనూసూద్‌కు ఇచ్చిన గౌరవం.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒడిశాకు చెందిన మైగ్రేంట్ వర్కర్ సోనూసూద్ సాయంతోనే కొచ్చిన్ నుంచి తన సొంతింటికి వెళ్లగలిగాడు. సోనూసూద్ అరేంజ్ చేసిన విమానం ద్వారా తన గ్రామానికి వెళ్లిన వలస కూలీ.. సోనూ సూద్ పేరిట వెల్డింగ్ షాప్ ప్రారంభించాడు. ఈ జన్మకు మీ రుణాన్ని తీర్చుకోలేనని.. నేను కొత్తగా ప్రారంభించిన షాప్‌కు మీ పేరు పెట్టడం ద్వారా థాంక్స్ చెప్పుకుంటున్నట్లు తెలిపాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇలాంటి హృదయపూర్వక సంఘటనలు చూడటం ఆనందంగా ఉందంటున్నారు నెటిజన్లు. నిజంగా ఇలాంటి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు సోనూసూద్ అర్హుడని అభినందిస్తున్నారు.