- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాతబస్తీలో అర్ధరాత్రి యువకుడు దారుణ హత్య.. అదే కారణమా..?
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : పాతబస్తీలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డ్రగ్స్‌కు బానిసైన ఓ వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో మరో వ్యక్తిపై దాడి చేసి కిరాతకంగా పొడిచేశాడు. స్థానికుల కథనం మేరకు.. దబీర్‌పురకు చెందిన ఫైజల్ (36)ను అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్ డ్రగ్స్ మత్తులో కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఫైజల్ ను అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులను చూసి నిందితుడు ఘటన స్థలం నుంచి పరారీ అయ్యాడు. కాగా, ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. డ్రగ్స్ మత్తులో హత్య చేశాడా..? లేక మరేదైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story