షైట్ షెడ్యూల్.. నిద్రలేమియే కారణామా?

by Shyam |
షైట్ షెడ్యూల్.. నిద్రలేమియే కారణామా?
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిశాయి. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా జీహెచ్ఎంసీలో అతి తక్కువ పోలింగ్ 36 శాతం నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోల్ పర్సంటేజ్ తక్కువగా నమోదు కావడంపై పలువురు రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందించారు. కరోనాకు భయపడే కొందరు బయటకు రాలేదని.. వరుసగా నాలుగు రోజులు హాలిడేస్ రావడం వలన సెటిలర్స్ సొంతూళ్లకు వెళ్లారని.. రాష్ట్ర ప్రభుత్వం హాలిడే ప్రకటించినా కొన్ని సంస్థలు సెలవు ఇవ్వలేదని.. మరికొందరు ఓటు వేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అయితే, ఓల్డ్ సిటీలోని యాకుత్ పురా తలాబ్ చంచాలం డివిజన్ ప రిధిలోని పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఎవరూ రాకపోవడంతో ఎన్నికల సరళిని పరిశీలించాల్సిన మైక్రో అబ్జర్వర్లు నిద్రపోయారు. పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఉన్నాయని, తమ ప్రతి కదలికనూ పై అధికారులు పరిశీలిస్తారనే విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. ఓటు వేసేందుకు ఎవరూ రాకపోవడమే అని అందుకు కారణమని అందరూ అనుకున్నారు. కానీ, గ్రేటర్ ఎన్నికలకు ముందురోజు మైక్రో అబ్జర్వర్లు బిజీబిజీగా గడపటం, రాత్రి నిద్రలేకపోవడం, మరల తెల్లవారు జామున 5గంటలకే వారి డే స్టాట్ కావడం వల్లే అలసిపోయినట్లు తెలుస్తోంది. దానికి తోడు ఓటర్లు వెనువెంటనే వస్తే ఆ బిజీలో వారు కూడా పడిపోయేవారు. విధుల్లో నిమగ్నమయ్యేవారు. కానీ అలా జరగలేదు. పోలింగ్ కేంద్రమంతా సైలంట్‌గా ఉండటం, ముందురోజు రాత్రి సరిగా నిద్రలేకపోవడమే పోలింగ్ సమయంలో టేబుళ్లపై కునుకు తీయడానికి కారణంగా తెలుస్తోంది.

పోలింగ్ ముందు రోజు షెడ్యూల్..

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ముందుగానే శిక్షణ ఇచ్చారు. ఏ కేంద్రంలో డ్యూటీ చేయాలో అందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. సరిగ్గా పోలింగ్‌కు ముందు రోజు డీఆర్సీ సెంట‌ర్ల వ‌ద్ద వారు క్యూ లైన్లో నిల‌బ‌డి త‌మ పోలింగ్ బూత్‌కు చెందిన ఎన్నిక‌ల మెటీరియ‌ల్‌ను వెంట తీసుకెళ్లారు. ఉద‌యం 7గంట‌ల‌కు పోలింగ్ మొదలైతే ఉదయం 5గంటలకు కేంద్రంలో రిపోర్ట్ చేయాల‌ని ఉన్న‌తాధికారులు ఆదేశించారు. ముందు రోజు మొత్తం లైన్‌లో నిలబడి, వచ్చాక మెటీరియల్ సరిచేసుకునే సరికి రాత్రి ఆలస్యమైందని సమాచారం. దానికి తోడు ఉదయాన్నే రిపోర్టు చేయాల్సి రావడంతో వారు నిద్ర‌కు దూర‌మ‌య్యారు. తీరా పోలింగ్ కేంద్రానికి ఓట‌ర్లు రాకపోవడం, ముందు రోజు నిద్రాహారాలు లేకపోవడమే మైక్రో అబ్జర్వర్ల నిద్రకు ప్రధాన కారణమని తేలింది.

Advertisement

Next Story