- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీమిండియాపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ వెటకారపు వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్: సమయం దొరికితే కోహ్లీ సేనపై విరుచుకు పడిపోవడానికి రెడీగా ఉండే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, టీవీ వ్యాఖ్యాత మైఖేల్ వాన్ మరోసారి టీమిండియాపై వెటకారపు వ్యాఖ్యలు చేశాడు. భారత మహిళల జట్టును అడ్డుపెట్టుకొని పురుషుల జట్టుపై ఇష్టానుసారం మాట్లాడాడు. ఇంగ్లాండ్ పరిస్థితులకు తగినట్లుగా కనీసం ఒక భారత జట్టైనా ఆడుతోందని ట్వీట్ చేశాడు. మిథాలీ సేన రెండో వన్డేలో ఓడిపోయింది. అయితే తొలి వన్డేతో పోలిస్తే రెండో వన్డేలో చక్కటి ప్రదర్శన చేసింది. ఓడిపోతుందని భావించిన ఏకైక టెస్టును భారత బ్యాటర్లు తమ పోరాటంతో డ్రాగా మలిచారు. వీటన్నింటి నేపథ్యంలో మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. ‘భారత మహిళల జట్టు ఈ రోజు అద్భుత పోరాటం చేసింది. ఇంగ్లీష్ పరిస్థితుల్లో కనీసం ఒక భారత జట్టైనా ఆడటం చూడటానికి చాలా బాగుంది’ అంటూ ట్వీట్ చేసి చివర్లో రెండు వెటకారపు ఎమోజీలు జత చేశాడు. టీమ్ ఇండియా క్రికెటర్లు మైఖేల్ వాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టు ఇండియా వచ్చి ఓడిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.