నిహాను రీప్లేస్ చేసిన మేఘా..

by Jakkula Samataha |
నిహాను రీప్లేస్ చేసిన మేఘా..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల‌కు పెండ్లి కళ వచ్చేసింది. ఇప్పటికే చైతన్యతో నిశ్చితార్థం కూడా అయిపోగా డిసెంబర్‌లో పెండ్లి పీటలు ఎక్కనుంది. అయితే, ఇప్పటికే తను కమిట్ అయిన ప్రాజెక్టులు కరోనా కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ లోపు తను ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకటి అశోక్ సెల్వన్ హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ కోలీవుడ్ మూవీ కూడా ఒకటి. స్వాతిని దర్శకురాలిగా పరిచయం కాబోతున్న ఈ మూవీనిసెల్వ కెనయ నిర్మిస్తున్నారు.

అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనున్న సినిమాలో నటించాలి అంటే మరింత సమయం కావాలని కోరిందట నిహారిక. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బడ్జెట్ విషయంలో ఇబ్బందులు, హీరో అశోక్ సెల్వన్ సహా మరింత మంది యాక్టర్లు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో నిహారిక రిక్వెస్ట్ పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. అందరు నటీనటులకు ఇబ్బంది కలగడం, బడ్జెట్ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకుని నిహారికనే మార్చేశారట. తన ప్లేస్‌లో క్యూట్ కుట్టి మేఘా ఆకాష్‌ను తీసుకున్నారని సమాచారం. కాగా, ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం మేఘ..టాంగో డ్యాన్స్ కూడా నేర్చుకుంటుందట. ఈ సినిమాలో హీరో అశోక్ సెల్వన్ కొరియోగ్రాఫర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘యాతుమ్ ఊరె యావరుమ్’ సినిమాలో అమలాపాల్‌ను కూడా రీప్లేస్ చేసిన మేఘ..గౌతమ్ మీనన్, విజయ్ వెబ్ షోస్‌లోనూ నటిస్తుందట.

Advertisement

Next Story