మెగా కలయిక.. చరణ్ తో 'కెజిఎఫ్' డైరెక్టర్.. రచ్చ షురూ

by Anukaran |   ( Updated:2021-10-15 23:54:55.0  )
మెగా కలయిక.. చరణ్ తో కెజిఎఫ్ డైరెక్టర్.. రచ్చ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ సంచలనంగా మారుతున్నాయి. ‘బాహుబలి’ చిత్రం తర్వాత తెలుగు సినిమా ప్రపంచ ఖ్యాతిని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ టాలీవుడ్ ఖ్యాతిని పెంచుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం అందరి చూపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పైనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, శంకర్ తో ‘ఆర్సీ 15’ వంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు గౌతమ్ తిన్ననూరి వంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో కూడా చరణ్ జతకట్టాడు. ఇక తాజాగా మరో పాన్ ఇండియా డైరెక్టర్ తో మరో సంచలనానికి సిద్దమయ్యాడు. ‘కెజిఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. దీంతో ఇండస్ట్రీలో చెర్రీ లైనప్ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

దసరా పండగ సందర్భంగా ఈ విషయాన్నిప్రశాంత్ నీల్ అధికారికంగా ప్రకటించారు. గురువారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి – చరణ్ – డీవీవీ దానయ్య లను ప్రశాంత్ నీల్ మీట్ అయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను ఆయన షేర్ చేస్తూ “ఒక లెజెండ్ ను, కాబోయే మరో లెజెండ్ ను కలుసుకున్నాను. ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చిన రామ్ చరణ్ కి ధన్యవాదాలు. చిరంజీవిని కలవడం నా చిన్ననాటి కల. ఈరోజుతో ఆ కల తీరింది”అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఒకదాని తరవాత ఒకటి టాప్ దర్శకులతో, టాప్ నిర్మాణ సంస్థలతో చెర్రీ అనుసంధానం అవ్వడం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ప్రస్తుతం చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా తర్వాత శంకర్ తో ‘ఆర్సీ 15’ షూటింగ్ ని మొదలుపెట్టనున్నాడు.. మరో పక్క ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్ 2’ ను ముగించి ప్రభాస్ ‘సలార్’ తో బిజీగా ఉన్నాడు. మరి ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్- చెర్రీ షూటింగ్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా మూడేళ్ల వరకు చెర్రీ లైనప్ మాములుగా లేదన్న విషయం తెలుస్తోంది.

https://www.facebook.com/groups/teluguviralnews

Advertisement

Next Story