- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
26న మెగాస్టార్ చిరు ‘ఆచార్య’ టీజర్?
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. షూటింగ్‌లో ఇటీవలే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జాయిన్ అయ్యాడు. చెర్రీ ఇందులో ‘సిద్ధ’గా ఫుల్ లెంత్ రోల్ ప్లే చేస్తున్నాడు. కాగా, రిపబ్లిక్ డే సందర్భంగా మెగాభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ‘ఆచార్య’ మూవీయూనిట్ సిద్ధమవుతోందట.
ఈ నెల 26న ‘ఆచార్య’ సినిమా టీజర్ విడుదల కాబోతోందన్న వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చిరుకు జీడీగా నటిస్తోంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నారు. ‘లూసిఫర్’ రీమేక్ పూజా కార్యక్రమాలు బుధవారం జరగ్గా..వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. మరో వైపు తమిళ్ ఫిల్మ్ ‘వేదాళం’ రీమేక్ కోసం డైరెక్టర్ మెహర్ రమేశ్ కోల్‌కత్తాలో లోకేషన్స్ సెర్చ్ చేస్తున్నారు.