- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెయిట్‌లిఫ్టింగ్‌లో ఏడేళ్ల చిన్నారి సంచలనం
దిశ, వెబ్‌డెస్క్: ఏడేళ్ల చిన్నారులు స్కూలు బ్యాగ్ మోయడానికే చాలా కష్టపడుతుంటారు. అలాంటిది 70 కిలోల ఎత్తడం సాధ్యమా? అంటే కెనడాకు చెందిన చిన్నారి ‘రోరీ వ్యాన్ ఉల్ట్’ సాధ్యం చేసి చూపించింది. నిజానికి అడల్ట్ జిమ్నాస్ట్స్ మాత్రమే 70 కిలోల బరువు ఎత్తగలరు. కానీ ఉల్ట్ మాత్రం ఎంతో ఈజ్, గ్రేస్‌తో అంత బరువును ఎత్తి అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ‘స్ట్రాంగెస్ట్ గర్ల్ ఇన్ ది వరల్డ్’గా నిలిచింది.
తనను తాను జిమ్నాస్టిక్‌గా చెప్పుకోవడానికి ఇష్టపడే ఏడేళ్ల ఉల్ట్.. వెయిట్‌లిఫ్టింగ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల 30 కిలోల విభాగంలో యూఎస్ అండర్-11, అండర్-13 టైటిళ్లు అందుకుని అత్యంత పిన్నవయస్సులో అమెరికా యూత్ నేషనల్ చాంపియన్‌గా రికార్డు సృష్టించింది. నాలుగు అడుగుల చిచ్చర పిడుగు ఈ ఫీట్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం ఒక ఎత్తయితే, డెడ్‌లిఫ్ట్‌లో ఏకంగా 80 కిలోలు ఎత్తి ఔరా అనిపించింది. అంతేకాదు స్నాచ్‌లో 32 కిలోలు, జెర్క్‌లో 42 కిలోలు, స్క్వాట్‌లో 61 కిలోల బరువులెత్తింది. రెండేళ్ల క్రితం నుంచి వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఉల్ట్.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. యూఎస్, కెనడాలో ఇంతవరకు యూత్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను రిప్రజెంట్ చేసే వెయిట్ లిఫ్టర్స్ ఎవరూ లేకపోవడంతో, యంగెస్ట్ యూఎస్ నేషనల్ చాంపియన్ చరిత్రలో తొలి వెయిట్ లిఫ్టర్‌గా రోరీ వ్యాన్ ఉల్ట్ నిలిచింది. ఉల్ట్ ప్రదర్శనలు చూసిన నెటిజన్లు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తూ, అభినందనలు తెలియజేస్తున్నారు.