ఆ టిక్‌టాకర్‌కు 100 మిలియన్ ఫాలోవర్స్

by Shyam |
ఆ టిక్‌టాకర్‌కు 100 మిలియన్ ఫాలోవర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘టిక్‌టాక్’తో ఎంతోమంది సెలెబ్రిటీలైన విషయం తెలిసిందే. తమ పొట్టి వీడియోలతో రాత్రికి రాత్రే స్టార్ హోదా అందుకున్నోళ్లు కూడా ఉన్నారు. తాజాగా అమెరికాకు చెందిన సోషల్ మీడియా పర్సనాలిటీ, డ్యాన్సర్ చార్లీ డి అమెలియో షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌లో సెన్షేషన్ సృష్టించింది. ప్రపంచంలోనే తొలిసారిగా 100 మిలియన్(10 కోట్లు) ఫాలోవర్స్‌ను సంపాదించిన వ్యక్తిగా అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.

100 మిలియన్ మార్క్ చేరుకునేందుకు ఓ యూట్యూబ్‌ చానల్‌కు 14 సంవత్సరాలు పట్టింది. కానీ టిక్‌టాక్‌లో 16 ఏళ్ల అమెరికా అమ్మాయి చార్లీ డీ అమెలియోకు మాత్రం ఏడాదిలో ఈ ఫీట్‌ను అందుకోవడం విశేషం. గతేడాది నవంబర్ నాటికి కేవలం చార్లీ 6 మిలియన్ల ఫాలోవర్స్‌ను మాత్రమే కలిగివుంది. పక్కింటి అమ్మాయిలా అనిపించే ఆమె అప్పియరెన్స్‌తో పాటు తను అందించే వీడియోలు.. అథెంటిక్, ఫన్, రిలేటెబుల్, అన్ కాంట్రవర్షియల్‌‌గా ఉండటంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఆమె డ్యాన్స్ వీడియోలు తనను మరింత పాపులర్ చేశాయి. దాంతో అతి తక్కువ కాలంలోనే టిక్‌టాక్‌లో 100 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని, ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఫాలో అవుతున్న టిక్‌టాకర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ హాలీవుడ్ హీరో విల్‌స్మిత్‌ కంటే రెండింతలు, హాలీవుడ్ హీరో, ప్రొఫెషనల్ రెజ్లర్ ద రాక్ ఫాలోవర్స్ కంటే మూడింతలు ఉన్నారు, సింగర్ సెలెనా గోమెజ్ కంటే ఫోర్ టైమ్స్ ఎక్కువున్నారు. ఇక టిక్‌టాక్‌లో ఆమె తర్వాతి స్థానంలో అడిసన్ రే 69.9 మిలియన్లతో ఉన్నాడు.

ఆమె పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి ఎన్నో ప్రముఖ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ బ్రాండ్స్ క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఆమె ఓ ఫీచర్ ఫిల్మ్‌కు కూడా సైన్ చేసింది. ఇప్పటికే ఆమె ఎంతోమంది హాలీవుడ్ నటీనటులతో స్టేజ్ షేర్ చేసుకుంది. అంతేకాదు డంకిన్స్ డోనట్స్.. ఆమె పేరు మీద ఓ డ్రింక్‌ను డెడికేట్ చేసింది. చార్లీ అమెలియో సిస్టర్ డిక్సీ కూడా ఫేమస్ పర్సనాలిటీనే. ఆమెతో కలిసి చార్లీ.. యూట్యూబ్‌లో పొడ్‌కాస్ట్ నిర్వహిస్తోంది. ఇక చార్లీ పేరెంట్స్ కూడా సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్స్ కావడం విశేషం. కాగా ఈ సెన్సేషన్ టిక్‌టాకర్ తన జర్నీని పుస్తకంగా తీసుకురాబోతుంది. ‘ఎసెన్సియల్లీ చార్లీ : ద అల్టీమేట్ గైడ్ టు కీపింగ్ ఇట్ రియల్’ పేరుతో రాబోతున్న ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదలవుతుంది.

‘అందరికీ ధన్యవాదాలు.100 మిలియన్స్ ఫాలోవర్స్‌కు చేరుకున్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారా? ఇది నిజమా?’ అని ట్వీట్ చేసింది చార్లీ.

Advertisement

Next Story