- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్ తండ్రికి న్యాయం చేయండి : మీరాచోప్రా
సుశాంత్‌కు హాని జరగనుందనే అనుమానంతో సుశాంత్ తండ్రి కేకే సింగ్.. ఫిబ్రవరిలోనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఆయన ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించిన విషయం తెలిసిందే. ఆ కేసు గురించి ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. ఫిబ్రవరి 25నే సుశాంత్‌కు డేంజర్ ఉందని ఫిర్యాదు చేయడంతో పాటు అందులో కొందరి పేర్లను కూడా వ్యక్తపరిచానని, అయితే సుశాంత్ మరణం తరువాత కూడా వారు దాన్ని పట్టించుకోలేదని వాపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేకే సింగ్ ఆవేదనన విని చాలా మంది సుశాంత్ కేసు విషయంలో న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోపై హీరోయిన్ మీరా చోప్రా స్పందించింది.
‘74 ఏళ్ల ఒక వృద్ధ తండ్రి తన కొడుకును కోల్పోయాడు. ఈ సమయంలో ఆయన తనకు న్యాయం కావాలని కోరుతున్నారు. కొడుకును ఎలాగూ పొందలేరు. కనీసం ఆయన న్యాయాన్ని కూడా పొందలేరా? అతని నిస్సహాయతకు నా హృదయం ముక్కలైంది. ఈగోలు పక్కనపెట్టి ప్రభుత్వం ఎందుకు ఈ కేసును సామరస్యంగా పరిష్కరించడం లేదు’ అంటూ మీరా చోప్రా ప్రశ్నించింది. పీఎంవో ఇండియా, అమిత్ షా, నితీష్ కుమార్ పేర్లను కూడా తన హ్యాష్ ట్యాగ్‌లో చేర్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ వైరల్ అయ్యింది.
కాగా, సుశాంత్ కేసును బీహార్ సీఎం.. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ముంబయి పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పటికే పలు అనుమానాలకు తావివ్వగా.. ఇప్పుడు కేసు సీబీఐ వద్దకు చేరడంతో సుశాంత్ మృతిపై ఉన్న అనుమానాలకు సమాధానం లభిస్తుందని అందరూ భావిస్తున్నారు.
74 year old father grieving his young sons demise. He will never get his son back, all hes asking for is justice. My heart breaks seeing his helplessness. Why cant the system work together in harmony to solve this case, keeping their egos aside. @PMOIndia @AmitShah @NitishKumar https://t.co/imK0xuDC20
— meera chopra (@MeerraChopra) August 3, 2020