తోకకు సమస్య వస్తే , తలకాయనే తీసేస్తవా రేవంత్.. మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా

by Ramesh Goud |
తోకకు సమస్య వస్తే , తలకాయనే తీసేస్తవా రేవంత్.. మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా
X

దిశ, వెబ్ డెస్క్: తోకకు సమస్య అని వస్తే, తలకాయనే తీసేస్తవా రేవంత్ రెడ్డి అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి (BRS Leader Jagadeesh Reddy) ఎద్దేవా చేశారు. సూర్యాపేట (Suryapeta)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హెచ్‌సీయూ భూముల అంశం (HCU Lands Issue)లో రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డిపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. తోకకు సమస్య అని వస్తే, తలకాయనే తీసేసేలా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నదని, 400 ఎకరాల పంచాయితీకి మొత్తం 2 వేల ఎకరాలను కొట్టేసే ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు.

పంచాయితీలో ఉన్న 400 ఎకరాలను అక్కడే ఉన్న హెచ్‌సీయూ కి వదిలేసి పోతే సమస్య ముగుస్తుందని, ఆయన చెబుతున్న ఫోర్థ్ సిటీ కోసమే, ఫ్యూచర్ సిటీ కోసమే మరో చోట 400 లకు బదులు 800 ఎకరాలు అమ్ముకుంటే ఏ సమస్య ఉండదు కదా అని అన్నారు. సీఎం లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడని, ప్రజల్లో విజ్ఞత ఉంటుందని, రీజన్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు నమ్మరని తెలిపారు. ఇప్పటికైనా ఈ తెలివితక్కువ పనులు మానుకొని, ప్రజలు ఏం ఆలోచిస్తున్నరు.. విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నరు అనేది బేరీజు వేసుకొని ముఖ్యమంత్రి కార్యాలయం (Chief Minister Office) పనిచేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) సూచించారు.

Next Story

Most Viewed