- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరీంనగర్‌లోనూ ఎంబీల గల్లంతు?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఇరిగేషన్ విభాగంలో కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలోనూ మెజర్ మెంట్ బుక్స్ (ఎంబీ) గల్లంతు అయినట్టు విశ్వసనీయ సమాచారం. కరీంనగర్, హుజురాబాద్ డివిజన్లకు సంబంధించిన దాదాపు 38 ఎంబీలు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందట ఎస్సారెస్పీ కెనాల్స్ డెవలప్‌మెంట్‌వర్క్స్‌తో పాటు మిషన్ కాకతీయ పనులకు సంబంధించిన ఎంబీలు మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.
ఏఏ పనులు ఏ స్టేజ్‌లో ఉన్నాయి? వాటికి చెల్లించేందుకు ఎంత డబ్బు డ్రా చేసేందుకు అనుమతి ఇచ్చారు? అని రూ.కోట్ల విలువ చేసే పనులకు సంబంధించిన వివరాలను ఎంబీల్లో ఇంజనీర్లు నమోదు చేశారు. అయితే ఈ ఎంబీలు గల్లంతు కావడం, ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుండడం చూస్తే గుట్టు రట్టు కాకుండా అప్రమత్తమై, ఇందుకు బాధ్యులైన అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.