- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మట్టి విగ్రహాలనే పూజించండి
by Shyam |

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: పర్యావరణ హితం కోసం మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా రోజు రోజుకు పెరిగి పోతున్న తరుణంలో వినాయక నవరాత్రులు నిర్వహించాల్సి రావడంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రజలు తమ ఇండ్లలోనే మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పూజలు చేయాలని సూచించారు. మండపాలకు అనుమతి లేనందున సామూహిక పూజలు నిర్వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో మమతా సంతోష్ గుప్తా, స్వప్న సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story