- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో అంతర్జాతీయ బీమా సంస్థ పెట్టుబడులు!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రముఖ వాహన సంస్థ ఫియట్ క్రిస్లర్ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ సంస్థలు కూడా తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఇన్సూరెన్స్ దిగ్గజ సంస్థ మాస్ మ్యూచువల్ తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లో తన కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు మాస్ మ్యూచువల్ సంస్థ వేయి కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనున్నట్టు తెలిపింది. ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఈ సంస్థ అమెరికా వెలుపల మొదటిసారిగా పెట్టుబడులు పెడుతుండటం విశేషం.
మసాచుసెట్స్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ కపెనీనే ‘మాస్ మ్యూచువల్’ కంపెనీగా పిలుస్తారు. ఇది స్ప్రింగ్‌ఫీల్డ్, మసాచుసెట్స్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ జీవిత బీమా, వైకల్య ఆదాయ బీమా, దీర్ఘకాలిక సంరక్షణ బీమా, పదవీ విరమణ వంటి పాలసీలను అందిస్తోంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలు, ఇన్సూరెన్స్ రంగాలకు కీలక పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. గతేడాది అక్టోబర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్‌లో గ్లోబల్ షేర్‌డ్ సర్వీసెస్ లోకేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ఇప్పటికే హైదరాబాద్‌లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, జేపీ మోర్గాన్, హెచ్ఎస్‌బీసీ వంటి అంతర్జాతీయంగా సంస్థలు ఉన్నాయి.