కుషాయిగూడలో భారీ చోరీ

by Shyam |   ( Updated:2020-08-15 09:51:36.0  )
కుషాయిగూడలో భారీ చోరీ
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కుటుంబ పెద్ద చనిపోవడంతో ఇంటిళ్లి పాది నిద్రకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ గురునాథ్ కథనం ప్రకారం.. కుషాయిగూడ‌లోని నాగార్జున నగర్ కాలనీ‌లో అఖిల్ కుటుంబం నివాసం ఉంటుంది.

ఇటీవల ఇంటి పెద్ద బాలయ్య మృతి చెందాడు. దీంతో శుక్రవారం అఖిల్ కుటుంబసభ్యులు రాత్రి యాదగిరిగుట్టకు నిద్రకు వెళ్లారు. శనివారం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 20 తులాల బంగారం, 45 తులాల వెండి, రూ. 25 వేల నగదు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.

Advertisement

Next Story