యజమాని ఇంట్లోనే భారీ దోపిడీ..!

by Shyam |
యజమాని ఇంట్లోనే భారీ దోపిడీ..!
X

దిశ, వెబ్‎డెస్క్: యజమాని ఇంట్లోనే భారీ చోరీకి పాల్పడింది ఓ బృందం. ఈ హైదరాబాద్‎లోని రాయదుర్గం డీఎన్ఆర్ హిల్స్‎లో చోటు చేసుకుంది. యజమాని ఇంట్లో రూ.15 లక్షలకు పైగా నగదు, బంగారం దోచుకెళ్లారు.

వివరాల్లోకి వెళ్తే.. బోర్‎వెల్ కాంట్రాక్టర్ గూడూరు మధు సుధన్ రెడ్డి ఇంట్లో గత కొంతకాలంగా నేపాల్‎కు చెందిన నలుగురు పనిచేసేవారు. ఈ క్రమంలో నలుగురు కలిసి దొంగతనానికి ప్లాన్ వేశారు. దీంతో యాజమాని మధుసూదన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన ఆహారం అందించారు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత రూ.15 లక్షల నగదుతో పాటు బంగారం దోచుకెళ్లారు. వీటితో పాటు సీసీటీవీ, ఇంట్లోని వారి ఫోన్లు ఎత్తుకెళ్లారు.

కాగా, నేపాలీ ముఠా మత్తుపదార్ధాలు కలిపిన ఆహారం మధుసూదన్ రెడ్డి భార్య శైలజారెడ్డి తినలేదు. చపాతీ తిన్న ఆమెకు నిద్రపోయిన కాసేపటికే మెలకువ వచ్చింది. వారి దొంగతనాన్ని గమనించినా భయంతో లేవలేకపోయింది. మధుసూదన్ రెడ్డి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నేపాలీ ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. మత్తుమందు ఉన్న ఆహారం తిన్నవారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story