- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
16 ఏళ్లలో 25 లక్షల స్విఫ్ట్ కార్ల విక్రయం : మారుతీ సుజుకి
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ స్విఫ్ట్ 25 లక్షల విక్రయాలను సాధించింది. 16 ఏళ్లలో కీలకమైన ఈ మైలురాయిని చేరుకున్నట్టు కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో స్విఫ్ట్ మోడల్ మొత్తం 23 లక్షల యూనిట్లను విక్రయించినట్టు తెలిపింది. ఆ తర్వాత కేవలం ఎనిమిది నెలల కాలంలో మరో రెండు లక్షల కార్లను విక్రయించగలిగింది. గత ఆర్థిక సంవత్సరంలో స్విఫ్ట్ మోడల్ మొత్తం వాహనాల విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించిందని మారుతీ సుజుకు సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. దేశీయంగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ కార్లు స్విఫ్ట్ మోడల్‌లో ప్రారంభమైందని శశాంక్ ప్రస్తావించారు.
అంతేకాకుండా భారత్‌లో అత్యధిక అవార్డులను అందుకున్న హ్యాచ్‌బ్యాక్ మోడల్ కూడా ఇదేనని పేర్కొన్నారు. 2005లో మొదటిసారిగా స్విఫ్ట్ కారును మారుతీ సుజుకి సంస్థ భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరో ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ కియా మోటార్స్ సైతం తన సొనెట్ కార్ల విక్రయాల్లో లక్షల యూనిట్ల మార్కును చేరుకున్నట్టు తెలిపింది. భారత్‌లో అత్యధికంగా కొనుగోలు చేయబడుతున్న నాలుగో ఎస్‌యూవీగా కియా సొనెట్ నిలిచిందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశీయంగా కియా కార్ల అమ్మకాల్లో 32 శాతం సొనెట్ మోడల్ వాటా ఉంది. అలాగే, భారత్‌లోని అన్ని ఎస్‌యూవీ కార్ల విక్రయాల్లో సొనెట్ 17 శాతం వాటాతో కొనసాగుతోంది.