మారుతీ సుజుకి ఆల్టో సరికొత్త రికార్డు

by Harish |
మారుతీ సుజుకి ఆల్టో సరికొత్త రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి(Maruti Suzuki) ఆల్‌టైమ్ బెస్ట్ సెల్లర్‌గా ఉన్న ఆల్టో(Alto) సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు మొత్తం 40 లక్షల యూనిట్లను విక్రయించి దేశంలోనే అత్యధిక యూనిట్లను విక్రయమైన కారుగా రికార్డులను సాధించింది. మారుతీ సుజుకి Maruti Suzuki)కంపెనీ నుంచి 2000వ సంవత్సరం సెప్టెంబర్‌లో దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. అప్పటినుంచి వరుసగా 16 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం దేశంలో బెస్ట్ సెల్లింగ్ కారుగా రికార్డులను నమోదు చేసింది.

ఎంట్రీ లెవల్ కారుగా పేరు తెచ్చుకున్న ఆల్టో, మొదటిసారి కారు కొనాలనుకునే వారికి అత్యుత్తమ ఎంపికగా ఆదరణ దక్కించుకుంది. ఆల్టో(Alto) కారు ధర, మైలేజ్ లాంటి కారణాలతో అమ్మకాల్లో స్థిరమైన కొనసాగింపును దక్కించుకుంది. ప్రస్తుత ఆల్టో పెట్రోల్ వేరియంట్(Alto petrol variant) లీటర్‌కు 22.05 కిలోమీటర్లు, సీఎన్‌జీ(CNG) వేరియంట్ 31.56 కిలోమీటర్లు ఇస్తోంది. ఆల్టో కారు ఎక్స్‌షోరూమ్(Ex show room) ప్రారంభ ధర రూ. 3 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ మోడల్ రూ. 4.36 లక్షలకే లభిస్తోంది. ఈ కారణాలతోనే ఆల్టో కారు వరుసగా 16 ఏళ్ల పాటు బెస్ట్ సెల్లింగ్(Best selling) కారుగా నిలవడమే కాకుండా, 20 ఏళ్లలోనే 40 లక్షల యూనిట్లను విక్రయించగలిగినట్టు మారుతీ సుజుకి ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed