- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదనపు కట్నం డిమాండ్..నిరసనకు దిగిన భార్య
దిశ, నిజామాబాద్ :
అత్త మామ, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని, అలాగే తన భర్తకు రెండో వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వివాహిత భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది.ఈ ఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన సునీత, సురేందర్ కొడుకు నవీన్ కుమార్‌కు గత రెండేండ్ల కిందట వేములవాడకు చెందిన పైడి అరుణతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వరకట్నంగా రూ.15లక్షలు, 20 తులాల బంగారం పెట్టువోతల కింద ఇచ్చారు. పెళ్లైన కొంతకాలం తర్వాత అత్తమామలు, భర్త, ఆడపడుచులు అదనపు కట్నం కోసం తనను వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసింది.మామ ప్రవర్తన బాగా లేదని, భర్త ఇంట్లో లేని సమయంలో లైంగికంగా వేధించేవాడని చెప్పారు. గతేడాది నవీన్ విడాకులు కావాలని కోర్టు ద్వారా తనకు నోటీసులు పంపించాడని అరుణ వాపోయారు.లాక్‌డౌన్ సమయంలో తన భర్తకు వివాహం చేసేందుకు ప్రయత్నాలు కూడా చేశారన్నారు. తాను ఇంటికి వస్తానన్న ఇంట్లోకి రానివ్వకుండా ఇంటికి తాళం వేశారని ఆమె తెలిపారు. తన భర్తను తనతో కలిపించాలని అరుణ ఈరోజు భర్త ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. తనకు పిల్లలు పుట్టడం లేదనే సాకును చూపుతూ వదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. అరుణ చేపట్టిన ధర్నాకు పలు మహిళా సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివాహితను సముదాయించి దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం చేశారు.