ప్రేమ పెండ్లి చేసుకున్న పాపానికి నా బిడ్డను చంపేశారు సార్..

by Sumithra |
ప్రేమ పెండ్లి చేసుకున్న పాపానికి నా బిడ్డను చంపేశారు సార్..
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని గుమస్తా కాలనీలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం సంచలనం రేపుతోంది. షేక్ సమీరా అలియాస్ స్రవంతి (19) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని.. అత్తింటివారు చెబుతుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. అత్త మామ, భర్త కలిసి కొట్టి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 7న గుమస్తా కాలనీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తిని స్రవంతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కుటుంబంలో కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

అయితే గత రెండు నెలలుగా భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారు. భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయా, లేక మనస్పర్థాలతో ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది. తమ కూతురు ఒంటిపై కొట్టినట్టుగా గాయాలున్నాయని, కొట్టిన తర్వాత ఉరివేసి ఆత్మహత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కామారెడ్డి డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ.. కేసు నమోదు చేసుకున్నామని.. పూర్తి వివరాలు విచారణ చేపట్టి వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story