- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోటీ చేయడానికి అభ్యర్థిని లేదని.. పెళ్లి చేసుకున్న లీడర్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రజా సేవ చేయాలని, రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కలలు కంటుంటారు. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు. అయితే ఓ 45 ఏళ్ల వ్యక్తి మాత్రం ప్రజాసేవ చేయడం కోసమే పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతడికి భార్య కావాల్సి వచ్చింది. వెంటనే ఓ అమ్మాయిని సెట్ చేసుకుని బరిలో దిగాడు.
వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ విచిత్ర పెళ్లికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హథీ సింగ్(45) ది బాలియా జిల్లాలోని కరణ్ చప్రా గ్రామం. ఆయన గత పదేళ్లుగా సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు సేవ చేస్తున్నాడు. సేవ చేయడం కోసమే ఇన్నేళ్లు పెళ్లి కూడా చేసుకోలేదు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసిన ఓడిపోయిన హథీసింగ్ మళ్లీ ఈ సారి బరిలో దిగాలనుకున్నాడు. అయితే ఆ గ్రామం మహిళకు రిజర్వ్ అయింది.
ఏమి పాలుపోని స్థితిలో ఉన్న హథీసింగ్ కు గ్రామస్తులు ఓ సలహా ఇచ్చారు. పెళ్లి చేసుకుని భార్యను పోటీలో నిలిపితే ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పారు. అయితే కరణ్ చప్రా గ్రామానికి ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 13 లోపు నామినేషన్ సమర్పించాలి. వెంటనే డిగ్రీ చదివిన ఓ యువతిని ఎంచుకుని మార్చి 26న వివాహం చేసుకున్నాడు. మంచి ముహూర్తాలు లేనప్పటికీ భార్యను సర్పంచ్ చేయడం కోసం ఆయన ఈ పెళ్లి చేసుకున్నాడు. గ్రామస్తులు సైతం ఆమెనే గెలిపిస్తామని చెబుతున్నారు. హథీసింగ్ మాత్రం గ్రామాభివృద్ధి కోసమే మ్యారేజ్ చేసుకున్నట్లు పేర్కొంటున్నాడు. ఏదిఏమైన ఓ ఎన్నిక 45 ఏళ్ల వ్యక్తి వివాహం చేసిందని కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.